మహేష్ టార్గెట్ ఫిక్స్ అయ్యింది..!

Published on Apr 10, 2020 7:13 am IST

అవును మహేష్ టార్గెట్ ఫిక్స్ అయ్యింది, ఆయన తన నెక్స్ట్ మూవీ ఏ దర్శకుడితో చేయాలో, ఎలాంటి కథతో చేయాలో ఫిక్స్ చేసుకున్నాడు. టాలీవుడ్ లో టాప్ హీరో మహేష్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయినప్పటికీ మహేష్ ఇంత వరకు ఒక పాన్ ఇండియా మూవీ చేయలేదు. మిగతా టాప్ స్టార్స్ అందరూ పాన్ ఇండియా చేసేయడమో, చేస్తూనో ఉన్నారు. ప్రభాస్ ఇప్పటికే మూడు పాన్ ఇండియా చిత్రాలు చేయగా, ఎన్టీఆర్, చరణ్ లు ఆర్ ఆర్ ఆర్ అనే భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. స్టార్ హీరోలలో పాన్ ఇండియా మూవీ చేయని వారిలో పవన్ మరియు అల్లు అర్జున్ కూడా ఉన్నారు.

ఐతే పవన్ క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న పీరియాడిక్ మూవీ పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. ఇక బన్నీ సుకుమార్ తో చేస్తున్న మూవీని ఐదు భాషలలో పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల రోజు స్పష్టత ఇచ్చారు. కాబట్టి ఈ ఫీట్ కి కేవలం మహేష్ బాబు మాత్రమే ఉన్నారు. కాబట్టి మహేష్ ఇంకా ఏ దర్శకుడితో ఫిక్స్ కాలేదని చెవుతున్న తరుణంలో ఆయన యూనివర్సల్ స్టోరీతో, పాన్ ఇండియా లెవల్ మూవీతో వచ్చిన దర్శకుడికి అవకాశం ఇస్తాడు అనడంలో సందేహం లేదు. మహేష్ ఫ్యాన్స్ డిమాండ్ కూడా ఇదే కావడంతో మహేష్ అలా ఫిక్స్ అవుతాడనిపిస్తోంది.

సంబంధిత సమాచారం :

X
More