ఫ్యాన్స్ కోసం చెమటలు చిందించనున్న ఎన్టీఆర్.

Published on Jun 5, 2020 8:18 am IST

ఎప్పుడూ లేని విధంగా ఎన్టీఆర్ నుండి రెండేళ్ల గ్యాప్ వచ్చింది. ఆర్ ఆర్ ఆర్ కారణంగా 2019లో మూవీ విడుదల చేయలేక పోయిన ఎన్టీఆర్, 2020 కూడా థియేటర్స్ లో దిగకుండానే ముగించనున్నాడు. దీనితో ఫ్యాన్స్ కి ఒకింత అసహనం ఎక్కువయ్యాయి. ఐతే తక్కువ వ్యవధిలో ఆయన నుండి రెండు సినిమాలు రానున్నాయి. 2021లో ఆర్ ఆర్ ఆర్ విడుదల ఉండగా, అదే ఏడాది నెలల గ్యాప్ లో త్రివిక్రమ్ మూవీ కూడా విడుదల కానుంది. ఇది కొంచెం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఉపశమనం కలిగించే అంశం.

కాగా ఎన్టీఆర్ 2022 వరకు తీరిక లేకుండా షూటింగ్స్ లో పాల్గొంటారని తెలుస్తుంది. ఆర్ ఆర్ ఆర్ మరియు త్రివిక్రమ్ సినిమాలలో ఒకేసారి పాల్గొననున్న ఎన్టీఆర్ ఆ వెంటనే ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతారట. ఈ ఏడాది చివర్లో ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ 2నుండి బయటికి వస్తారు. ఆయన ఎన్టీఆర్ మూవీ 2021చివర్లో పట్టాలెక్కించనున్నారు. దీనితో ఎన్టీఆర్ ఆ ప్రాజెక్ట్ షూటింగ్ లో ఏడాదికి పైగా పాల్గొనాల్సివుంది.దీనితో ఎన్టీఆర్ రాబోయే రెండేళ్లలో తీరిక లేకుండా షూటింగ్స్ లో పాల్గొనాల్సిన పరిస్థితి ఉంది.

సంబంధిత సమాచారం :

More