పవన్ – త్రివిక్రమ్ కోసం ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్

పవన్ – త్రివిక్రమ్ కోసం ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్

Published on Apr 12, 2015 9:21 PM IST

pawan-kalyan-trivikram
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇదొక క్రేజీ కాంబినేషన్.. సినిమా పరంగానే కాకుండా వీరిద్దరూ మంచి సన్నిహితులు కూడా.. అత్తారింటికి దారేది టైం వీరిద్దరి కాంబినేషన్లో ‘కోబలి’ అనే సినిమా ఉంటుందని అనౌన్స్ చేసారు. రాయలసీమ ప్రాంతంలోని ఆచార వ్యవహారాల మీద ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. కానీ ఆ తర్వాత వీరిద్దరూ పలు సినిమాలలో బిజీగా ఉన్నారు. కానీ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.

S/O సత్యమూర్తి సినిమా విడుదలై సక్సెస్ అవ్వడంతో త్రివిక్రమ్ మీడియాతో మాట్లాడారు. కోబలి సినిమా గురించి మాట్లాడుతూ ‘ఈ సినిమా రీ సర్చ్ లో భాగంగా ప్రీ ప్రొడక్షన్ కె బాగా ఖర్చు పెట్టాం. అన్నీ సమకూరగానే ఈ సినిమా మొదలవుతుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేయడానికి ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ కూడా అప్రోచ్ అయ్యామని’ త్రివిక్రమ్ తెలిపాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ S/O సత్యమూర్తి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుంటే, పవన్ కళ్యాణ్ మాత్రం గబ్బర్ సింగ్ 2 కోసం సిద్దమవుతున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు