కృష్ణాలో ఆ మూడు సినిమాలు వసూళ్ల విషయంలో పోటీపడుతున్నాయి !

Published on Apr 20, 2019 11:33 am IST

కృష్ణా జిల్లాలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ విషయంలో పోటీపడుతున్నాయి. నిన్న విడుదలైన జెర్సీ , కాంచన 3 అలాగే ఇటీవల విడుదలైన మజిలీ. అందులో భాగంగా నాని నటించిన స్పోర్ట్స్ డ్రామా జెర్సీ మంచి అంచనాలమధ్య నిన్న విడుదలై పాజిటివ్ రివ్యూస్ ను అలాగే ఎక్ట్రార్డినరీ టాక్ ను సొంతం చేసుసుకొని మొదటి రోజు కృష్ణా లో 33. 80 లక్షల షేర్ ను రాబట్టుకుంది.

ఇక చిత్రం పాటు రాఘవ లారెన్స్ నటించిన హారర్ థ్రిల్లర్ కాంచన 3 కూడా నిన్న విడుదలై మంచి వసూళ్లను రాబట్టుకుంటుంది. సూపర్ హిట్ ముని సిరీస్ కు సీక్వల్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి ముఖ్యంగా బిసి సెంటర్ల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. దాంతో కృష్ణా లో ఈ చిత్రం మొదటి రోజు 30.13 లక్షల షేర్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీనిస్తుంది.

ఇక ఈ చిత్రాలతో పాటు ఇటీవల విడుదలైన మజిలీ , చిత్రలహరి కలెక్షన్ల విషయానికి వస్తే నిన్న మజిలీ అక్కడ 1.37లక్షల షేర్ తో 15రోజులకు గాను 1. 73 కోట్ల షేర్ ను రాబట్టి జెర్సీ , కాంచన 3 కి గట్టి పోటీనిస్తుంది.

ఇక సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రలహరి మాత్రం రేస్ లో వెనకబడింది. ఈ చిత్రం నిన్న 95,517 లక్షల షేర్ తో 8 రోజుల్లో 72.67 లక్షల షేర్ ను రాబట్టింది. అయితే ఎలక్షన్స్ హడావిడి ముగిసిన ఐపీఎల్ రూపంలో ఈ సినిమాల ఫస్ట్ షో , సెకండ్ షో కల్లెక్షన్లపై ప్రభావం పడుతుంది.

సంబంధిత సమాచారం :