నందమూరి మోక్షజ్ఞ మొదటి సినిమా ‘ఆదిత్య 369’కి కొనసాగింపుగా రాబోతుంది. ‘ఆదిత్య 999 మ్యాక్స్’ అనే టైటిల్ తో మోక్షజ్ఞ కథానాయకుడిగా పరిచయం కానున్నట్టు బాలయ్య ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. కాగా ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కించనున్నాడు. ఆల్ రెడీ ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయింది. కాగా వచ్చే ఏడాది జనవరి ఎండింగ్ లో ఈ సినిమాని అధికారికంగా మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. మార్చి నుంచి షూటింగ్ ను స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నారట. ఇప్పటికే, మోక్షజ్ఞ రిహార్సల్స్ చేస్తున్నారట.
కాగా ఈ సినిమాలోని ఇతర క్యాస్టింగ్ పై క్రిష్ ప్రస్తుతం ఫోకస్ పెట్టాడట. అన్నట్టు ఈ సినిమాలో బలమైన క్యాస్టింగ్ కూడా ఉంటుందట. అలాగే, మోక్షజ్ఞ లుక్ కూడా చాలా స్టైలిష్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఆ మధ్య తన వారసుడి ఎంట్రీ పై బాలయ్య మాట్లాడుతూ.. ‘మోక్షజ్ఞను ఎలా ఇంట్రడ్యూస్ చేయాలో నాకు తెలుసు. మోక్షజ్ఞ కోసం ఒక ఐదు ఆరు స్క్రిప్ట్స్ నా మైండ్ లోనే రెడీగా ఉన్నాయి’ అని చెప్పుకొచ్చారు. రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నారు.


