‘గోపాల గోపాల’పై మరో ఫ్రెష్ కంప్లైంట్

‘గోపాల గోపాల’పై మరో ఫ్రెష్ కంప్లైంట్

Published on Jan 15, 2015 10:50 PM IST

Gopala-Gopala-(3)
సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలైన టాలీవుడ్ మల్టీ స్టారర్ మూవీ ‘గోపాల గోపాల’. పవన్ కళ్యాణ్ – వెంకటేష్ కలిసి నటించిన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. కానీ ఈ సినిమాలో మతానికి సంబందించిన కొన్ని వివాదాస్పద సీన్స్ ఉన్నాయని పలువురు ఈ చిఎన్మాపై కేసు వేస్తున్నారు. కొంత మంది లాయర్స్ సినిమాని ఆపేయాలని కూడా ట్రై చేస్తున్నారు. ఇటీవలే అమీర్ ఖాన్ హిందీ సినిమాపై చాల అమంది కేసులు వేసారు అది అయ్యిందో లేదో ఇప్పుడు గోపాల గోపాల పై కేసులు వేస్తున్నారు.

తాజాగా ఓ లాయర్ గోపాల గోపాల సినిమా ఆపేయాలని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసాడు. ఈ సినిమాలో లాయర్స్ మనోభావాలను దెబ్బ తీసేలా సీన్స్ ఉన్నాయని ఆయన ఫిర్యాదు చేసారు. కానీ వేల్లందరికీ తెలియని విషయం ఏమిటంటే ఈ సినిమాలోని సెంటర్ల్ బోర్డు క్లియరెన్స్ తీసుకునే రిలీజ్ అయ్యింది. కావున ఇలాంటి కేసులు ఎన్ని వేసినా గోపాల గోపాల సినిమాకి బ్రేక్ పడే ఛాన్స్ లేదు. సంక్రాంతి సీజన్ కావడం వలన సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు