రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న సినిమా ‘రౌడీ జనార్దన’. ఐతే, ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం ఓ భారీ సెట్ ను వేస్తున్నారు. ఈ సెట్ లో రెండు వారాల పాటు యాక్షన్ సీక్వెన్స్ లను షూట్ చేస్తారట. ప్రముఖ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో ఈ ఫైట్స్ చిత్రీకరిస్తారట. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ లో విజయ్ దేవరకొండ ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉంటాడని..పైగా సినిమా మొత్తంలోనే ఈ యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ గా ఉంటుందని తెలుస్తోంది.
స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అన్నట్టు రాజశేఖర్ పాత్ర అండ్ ఆయన లుక్ మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుందట. ఇప్పటికే, లుక్ టెస్ట్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా కీర్తి సురేశ్ నటించనుంది. మొత్తానికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.


