
బిజీ ఫారెన్ షెడ్యూల్ ముగించుకున్న తరువాత అఖిల్ అక్కినేని కాస్త గ్యాప్ తీసుకుని తిరిగి షూటింగ్ లో బిజీకానున్నాడు. తాజా షెడ్యూల్ రేపటినుండి ప్రారంభమై ఐదు రోజులపాటూ సాగనుంది.
ఈ షెడ్యూల్ లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. దీనితరువాత బృందమంతా యుగాండా బయల్దేరనుంది.
నితిన్ నిర్మాణంలో వి.వి వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. సాయేషా హీరోయిన్. అనూప్ రూబెన్స్ మరియు థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు

