సెప్టెంబర్‌లోనే రిలీజ్ కాబోతున్న ‘ఫ్రెండ్‌ షిప్‌’..!

Published on Aug 24, 2021 11:19 pm IST

టీమిండియా క్రికెట్ మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, యాక్ష‌న్ కింగ్ అర్జున్ హీరోలుగా న‌టించిన చిత్రం ‘ఫ్రెండ్ షిప్‌’. జాన్‌పాల్‌ రాజ్-శ్యామ్‌ సూర్య సంయుక్త దర్శకత్వంలో, ఏ.ఎన్‌.బాలాజీ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం మలయాళంలో సూప‌ర్ హిట్ అయిన ‘క్వీన్’ సిరీస్‌కు రీమేక్. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏకకాలంలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

అయితే శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత, నిర్మాత ఎ.ఎన్ బాలాజీ మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ తర్వాత తెలుగు ప్రేక్షకులు సినిమాలను బాగా ఆదరిస్తున్నారని అన్నారు. 25 కోట్ల బడ్జెట్‌తో స్నేహం నేపథ్యంలో రూపొందించిన ‘ఫ్రెండ్ షిప్‌’ సినిమాను సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నామని, త్వ‌ర‌లోనే రిలీజ్‌ డేట్‌ను కూడా ప్రకటిస్తామని వెల్లడించారు.

సంబంధిత సమాచారం :