మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “మన శంకర వరప్రసాద్ గారు”. మంచి బజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ సినిమా నుంచి ఇన్ని రోజులు మెగాస్టార్ ని సాఫ్ట్ అండ్ స్టైలిష్ గా మాత్రమే చూపించిన మేకర్స్ ఇప్పుడు మాస్ యాంగిల్ ని కూడా పరిచయం చేశారు. లేటెస్ట్ గా వదిలిన పోస్టర్ ఒకటి ఫ్యాన్స్ లో క్రేజీగా మారింది. ఇన్ని రోజులు మీసాల పిల్లా, సురేఖ సాంగ్స్ లో సాఫ్ట్ గా కనిపించిన మెగాస్టార్ తో సాలిడ్ యాక్షన్ కూడా చేపించినట్టు ఇందులో కనిపిస్తుంది. మెషిన్ గన్ పట్టుకొని గాయాలతో కనిపిస్తున్న మెగాస్టార్ కొత్త పోస్టర్ అదిరింది అనే చెప్పాలి.
సో మొత్తానికి అనీల్ రావిపూడి మెగాస్టార్ తో అన్ని రకాల ఎలిమెంట్స్ సెట్ చేసినట్టే ఉన్నాడనుకోవాలి. ఇక ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొస్తుండగా అభిమానులు భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే వెంకీ మామ కీలక పాత్ర చేస్తున్న ఈ సినిమాని షైన్ స్క్రీన్ సినిమా వారు నిర్మాణం వహిస్తున్నారు.


