మొదలైన ‘ఐ’ హంగామా – టికెట్స్ కి ఫుల్ క్రేజ్

I

సౌత్ ఇండియన్ మోస్ట్ సక్సెఫుల్ డైరెక్టర్ శంకర్, సినిమా కోసం ఏమన్నా చేసే చియాన్ విక్రమ్ కాంబినేషన్ లో రానున్న సినిమా ‘ఐ’. ఎన్నో రోజులుగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ టైం దగ్గర పడింది. మరో 40 గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్స్ లో సందడి చేయనుంది. ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంతా 20 వేలకి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. అందులో చైనాలోనే 15,00 థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

ఈ సినిమా బుకింగ్ ఈ రోజు ఉదయం మొదలయ్యాయి. మొదలైన కొద్ది సేపట్లోనే ఈ సినిమా టికెట్స్ హాట్ కేక్స్ లా అమ్మురు పోయాయి. టికెట్స్ కోసం జరిగిన సంగ్రామంలో పలు ఆన్ లైన్ బుకింగ్ వెబ్ సైట్స్ కూడా హాంగ్ అయ్యాయి. ప్రతి మేజర్ సిటీలోనూ ఈ సినిమా టికెట్స్ కి ఫుల్ క్రేజ్ ఏర్పడింది. అప్పుడే మొదటి మూడు రోజులకి సంబదించిన టికెట్స్ దాదాపు అమ్ముడుపోయాయి. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉండడమే కాకుండా సంక్రాంతి బరిలో వస్తుండడంతో ఈ సినిమా చూడటానికి మరింత ఆసక్తి చూపుతున్నారు.

సెన్సార్ నుండి ‘యు/ఏ’ సర్టిఫికేట్ అందుకున్న ‘ఐ’ సినిమా రన్ టైం 3 గంటల 3 నిమిషాలు(183 నిమిషాలు). విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఇండియన్ ఫిల్మ్ స్టాండర్డ్స్ ని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళేలా ‘ఐ’ ఉంటుందని ఈ చిత్ర టీం అంటోంది. విక్రమ్ మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించిన ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించింది. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాని ఆస్కార్ రవిచంద్రన్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించాడు.

Exit mobile version