మహేష్ ఈ కామెంట్ మీకే – కేటిఆర్
Published on Jun 2, 2018 6:00 pm IST


తెలంగాణ మంత్రి కేటీఆర్ శైలి చాలా ప్రత్యేకమైంది. ముఖ్యంగా స్నేహితుల విషయంలో చాలా సరదాగా ఉంటారాయన. ఆయనకు తెలుగు పరిశ్రమ నుండి చాలా మంది స్నేహితులే ఉన్నారు. వారిలో సూపర్ స్టార్ మహేష్ అంటే కేటీఆర్ కు ప్రత్యేకమైన అభిమానం. మహేష్ తాజా చిత్రం ‘భరత్ అనే నేను’ సందర్భంలో ఈ విషయం అందరికీ తెలిసింది. తాజాగా జరిగిన ట్విట్టర్ సంఘటన ఒకటి మరోసారి కేటీఆర్, సూపర్ స్టార్ల స్నేహాన్ని గుర్తుచేసింది.

కేటీఆర్ అభిమాని ఒకరు నిన్న రాత్రి కేటీఆర్ తన అభిమానులతో సెల్ఫీ దిగుతున్న ఫోటో ఒకదాన్ని షేర్ చేసి ‘కేటీఆర్ గారు అబ్బాయిలకు కూడ సెల్ఫీలు ఇస్తారు.. ఇది నిజం’ అంటూ కామెంట్ పెట్టారు. దీనికి స్పందించిన కేటీఆర్ ఆ సంభాషణకి మహేష్ ని జోడిస్తూ ‘మహేష్ ఇది మీకే’ అంటూ సరదా కామెంట్ చేశారు. ఆ కామెంట్ ను ఎంజాయ్ చేసిన మాహేష్ దానికి స్మైలీ సింబల్ తో బదులిచ్చారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook