‘గాయపడ్డ సింహం’ మెగా సాంగ్‌ను పట్టేసిందా..?

‘గాయపడ్డ సింహం’ మెగా సాంగ్‌ను పట్టేసిందా..?

Published on Apr 28, 2026 7:06 PM IST

Gaayapadda-Simham-1

తరుణ్ భాస్కర్ లీడ్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘గాయపడ్డ సింహం’ మే 1న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాను దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను అలరించబోతుంది. ఇక ఈ సినిమాలో జేడీ చక్రవర్తి కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

అయితే, ఈ చిత్రంలో ఫ్యాన్స్‌కు నచ్చేలా భారీ సర్ప్రైజ్‌లను ప్లాన్ చేశారు. ముఖ్యంగా మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్ వంటి అగ్ర హీరోల రిఫరెన్సులు, డైలాగులు సినిమాలో సందడి చేయనున్నాయి. ఈ స్టార్ హీరోల ఇమేజ్‌ను వెండితెరపై ఎలా వాడారనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ఐకానిక్ హిట్ సాంగ్ ‘గోలీమార్’ రీమిక్స్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ కానుందట. చిరుపై ఉన్న అభిమానంతో చిత్రబృందం భారీ మొత్తాన్ని ఖర్చు చేసి, ఈ పాటను రీమిక్స్ చేశారట.

మరి మెగాస్టార్ సాంగ్‌తో వస్తున్న ‘గాయపడ్డ సింహం’ ఆ పాటను ఎలా వాడుకున్నారో తెలియాలంటే మే 1 వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు