పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్ 2’ హీరోయిన్ అనీష అంబ్రోస్, ‘గోపాల గోపాల’లో తళుక్కున మెరిసింది. అతిధి పాత్రలో సందడి చేసింది. ‘గోపాల గోపాల’ సినిమా సెకండ్ హాఫ్ లో కీలకమైన వెంకటేష్ ఇంటర్వ్యూను చేసిన యాంకర్, అనీషానే. పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా కావడంతో పాత్ర పరిధి చిన్నదే అయినా, మరో ఆలోచన లేకుండా ‘గోపాల గోపాల’లో నటించడానికి అనీష తన అంగీకారం తెలిపిందని సమాచారం. టీవీ కార్యక్రమ వ్యాఖ్యాతగా నటించి మెప్పించింది.
సంక్రాంతి కానుకగా నేడు విడుదలయిన ఈ సినిమా వెంకటేష్, పవన్ కళ్యాణ్ అభిమానులకు రెండు రోజుల ముందే పండుగ తీసుకొచ్చింది. అన్ని ఏరియాల నుండి ‘గోపాల గోపాల’ హిట్ టాక్ సొంతం చేసుకుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా తెరకెక్కిన ఈ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలో ఇద్దరు అగ్ర హీరోలు తమ ఇమేజ్, స్టార్ స్టేటస్ పెక్కనపెట్టి నటించడం అభినందనీయం.


