
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయి టాలీవుడ్ బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ రికార్డ్స్ మోత మోగించిన సినిమా ‘గబ్బర్ సింగ్’. ఈ సినిమా విడుదలైన కొద్ది రోజులకే ఈ ‘గబ్బర్ సింగ్ 2’ టైటిల్ తో ఓ సినిమా చేయనున్నామని అనౌన్స్ చేసారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉండడం ఈ సినిమా కాస్త ఆలస్యం అయ్యింది. ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని పవన్ అభిమానులు ఎదురు చూస్తున్న ఈ సినిమా షూటింగ్ మే 29 నుంచి హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. ప్రస్తుతం దేవీశ్రీ ఈ సినిమా కోసం మరో సూపర్ హిట్ ఆల్బమ్ ని సిద్దం చేసే పనిలో ఉన్నాడు.
ఇదిలా సాగుతుంటే ఈ చిత్ర డైరెక్టర్ బాబీ మరియు సినిమాటోగ్రాఫర్ జయనన్ విన్సెంట్ గబ్బర్ సింగ్ 2 లొకేషన్స్ వేటలో ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి మహారాష్ట్ర మరియు రాజస్తాన్ లలో సూపర్ లొకేషన్స్ ని ఫైనలైజ్ చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం ముగిసింది. ఈ సినిమాని 2016 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి పండుగ సీజన్ ని కూడా లాక్ చేసేసారు. ఈ సినిమాలో పవన్ సరసన ఇద్దరు భామలు కనిపించనున్నారు. అందులో ఒక హీరోయిన్ గా అనీషా అంబ్రోసేని ఫైనలైజ్ చేయగా రెండవ హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతోంది. శరత్ మరార్ ఈ సినిమాకి నిర్మాత.

