పవన్ ‘గబ్బర్ సింగ్ 2’కి ముహూర్తం ఫిక్స్.!

పవన్ ‘గబ్బర్ సింగ్ 2’కి ముహూర్తం ఫిక్స్.!

Published on May 11, 2015 4:12 PM IST

pawan-kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయి టాలీవుడ్ బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ రికార్డ్స్ మోత మోగించిన సినిమా ‘గబ్బర్ సింగ్’. ఈ సినిమా విడుదలైన కొద్ది రోజులకే ఈ ‘గబ్బర్ సింగ్ 2’ టైటిల్ తో ఓ సినిమా చేయనున్నామని అనౌన్స్ చేసారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ గా ఉండడం వలన ఈ సినిమా వెనక్కి వెళుతోంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందా అని పవన్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అభిమానులను సంతోష పరిచే తీపి వార్తని ఇప్పుడు మీకు చెబుతున్నాం. ఈ సినిమా షూటింగ్ మే 29 నుంచి హైదరాబాద్ లో ప్రారంభం కానుంది.

అలాగే ఈ సినిమాని 2016 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి పండుగ సీజన్ ని కూడా లాక్ చేసేసారు. ‘పవర్’ సినిమాతో పరిచయమైన బాబీ గబ్బర్ సింగ్ 2 కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ సరసన ఇద్దరు భామలు కనిపించనున్నారు. అందులో ఒక హీరోయిన్ గా అనీషా అంబ్రోసేని ఫైనలైజ్ చేయగా రెండవ హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు అన్నీ పూర్తి చేసాకే సెట్స్ పైకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ చిత్ర టీం అన్ని పనులను పూర్తి చేస్తోంది. ఇప్పటికే బాబీ దేవీశ్రీ ప్రసాద్ తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలు పెట్టాడు. శరత్ మరార్ ఈ సినిమాకి నిర్మాత.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు