
టాలీవుడ్లో ఎప్పటికప్పుడు తన స్టైల్ మరియు నటనతో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ “గబ్బర్ సింగ్”, భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఘన విజయాన్ని సాదించడమే కాకుండా ఈ చిత్రం ఈ రోజుతో 306 కేంద్రాలలో 50 రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ చిత్రం హైదరాబాద్‌లో అత్యదిక కేంద్రాల్లో 50 రోజులు పూర్తిచేసుకున్న చిత్రంగా నమోదైంది. ఈ చిత్రం విడుదలైన రోజునుంచి భారీగా కలెక్షన్లు రాబట్టుకుంటోంది. పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత ఒక బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్నారు, ఈ చిత్రం ఇప్పటికే టాలీవుడ్ లో అత్యధిక రికార్డు కలెక్షన్స్ సాధించిన చిత్రాలలో ఒకటిగా చేరిపోయింది. ఈ చిత్రంలో అందాల భామ శ్రుతి హాసన్ కథానాయికగా నటించారు. ఈ చిత్రానికి యంగ్ తరంగ్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకుంటోంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పరమేశ్వరా ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఇంతటి ఘన విజయం సాధించిన సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మరియు ఆ చిత్ర టీంకి మా తరపున అబినందనలు తెలుపుకొంటున్నాము.
దిగ్విజయంగా 50 రోజులు పూర్తి చేసుకున్న ‘గబ్బర్ సింగ్’
దిగ్విజయంగా 50 రోజులు పూర్తి చేసుకున్న ‘గబ్బర్ సింగ్’
Published on Jun 29, 2012 8:35 AM IST
సంబంధిత సమాచారం
- సైలెంట్‌గా రూట్ మార్చిన శ్రీలీల.. టాలీవుడ్‌కి గ్యాప్ ఇవ్వడం వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
- వెయిటింగ్ మోడ్‌లో బోయపాటి.. ఎవరితో సెట్ చేస్తారో..?
- ‘ఫౌజీ’ ట్రీట్‌కు అడ్డంకులు.. ప్లాన్ మార్చిన మేకర్స్..?
- తమిళ్లో ఎంట్రీకి సిద్ధమవుతున్న జాన్వీ.. అయితే..?
- షూటింగ్ లేకపోయినా సెట్స్‌కి వచ్చిన ప్రభాస్: ‘ఫౌజీ’ అప్డేట్తో పాటు స్టూడెంట్స్‌కు డార్లింగ్ మెసేజ్!
- శర్వానంద్-శ్రీను వైట్ల మూవీ లాంచ్‌కి ముహూర్తం ఫిక్స్..!
- పూరీ జగన్నాధ్‌కు అడ్డుపడుతున్న విజయ్ సేతుపతి..!
- ‘బ్లడీ రోమియో’ విధ్వంసానికి గెట్ రెడీ.. ధురంధర్ సంగీత దర్శకుడైతే కాదు!
- 12 రోజుల్లో రూ. 500 కోట్లు: భారత బాక్సాఫీస్ వద్ద టామ్ హాలండ్ ‘స్పైడర్-మ్యాన్’ హవా
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?
- అఫీషియల్: ఐమ్యాక్స్ వెర్షన్ కన్ఫర్మ్ చేసుకున్న ‘టాక్సిక్’.. గ్రాండ్ ఎంట్రీకి సిద్ధం!
- ‘ఇరుముడి’తో క్లాష్.. దుల్కర్ సినిమా వాయిదా!?
- ‘ఇరుముడి’ సినిమాలో శబరిమలతో సంబంధం లేదట..!
- ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్‌కు టైమ్ ఫిక్స్.. పూనకాలు లోడింగ్..!
- ఇంట్రెస్టింగ్ బజ్.. ‘జై హనుమాన్’లో ట్రెండింగ్ బ్యూటీ!?
- వెంకీతో బయోపిక్ చేయాల్సింది.. కానీ కుదర్లేదు – సూర్య
- మెగా హీరోల వరుస హిట్లు.. మిగిలిపోయింది ఆ హీరో ఒక్కడే..!

