వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ గద్దలకొండ గణేష్ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ సాధిస్తుంది. గత మూడు రోజులుగా ఈ చిత్ర వసూళ్లు నిలకడగా కొనసాగడం విశేషం. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం విజయం వైపుగా దూసుకుపోతుంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ చిత్ర వసూళ్లు అంచనాలకు మించి ఉన్నాయి. నిన్న ఆదివారం గద్దలకొండ గణేష్ నైజాంలో 1.47 షేర్ సాధించింది. దీనితో వీకెండ్ పూర్తైయ్యేనాటికి మూడురోజులకు గానూ , 4.53 కోట్ల డిస్ట్రిబ్యూటర్స్ షేర్ కొల్లగొట్టింది.
ఇక సోమవారం నుండి వచ్చే వసూళ్లను బట్టి ఈ చిత్రం ఏ స్థాయి విజయం సాధిస్తుందో చెప్పవచ్చు. ఐతే వచ్చే వారం చెప్పుకోదగ్గ పెద్ద సినిమాల విడుదల లేకపోవడం అలాగే సూర్య బందోబస్త్ మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడం ఈ మూవీ వసూళ్లకు అనుకూలించే అంశం. అక్టోబర్ 2న సైరా విడుదల అయ్యేవరకు గద్దలకొండ గణేష్ చిత్ర వసూళ్ల జోరు కొనసాగే అవకాశం కలదు.
