” గజేంద్రుడు” సక్సెస్ మీట్ పాల్గొన్న చిత్ర యూనిట్.

Published on Jun 26, 2019 2:33 pm IST

ఆర్య హీరోగా రాఘవన్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం “గజేంద్రుడు”. తమిళ ‘కదంబన్’చిత్రానికి తెలుగు అనువాదంగా విడుదలైన “గజేంద్రుడు” మూవీని ఉదయ్ హర్ష విడుదల చేశారు‌. భారతీ ,వరప్రసాద్ వడ్డెల సమర్పకులు. విడుదలైన అన్ని కేంద్రాలలో పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న ఈ మూవీ మంచి వసూళ్లు సాధిస్తుంది.

ఈ సందర్భంగా చిత్ర సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసారు. ఎటువంటి ప్రచార ఆర్భాటం లేకుండా విడుదలైనా కూడా దాదాపు నైజాం ఏరియాలో 300 థియేటర్లలో ప్రదర్శించబడుతూ విజయవంతంగా ప్రదర్శించబడుతూ సైలెంట్ హిట్ గా నిలిచింది అని ఈ మూవీని నైజాంలో విడుదల చేసిన ప్రశాంత్ గౌడ్ అన్నారు అడవిలో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఈ చిత్రాన్ని నిర్మించాం,తెలుగు,తమిళ ప్రేక్షకులు ఆకష్టానికి ఫలితంగా మంచి విజయాన్ని అందించారు అన్నారు హీరో ఆర్య. ఆర్య సరసన క్యాథరిన్ నటించిన ఈ మూవీని సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆర్ బి చౌదరి నిర్మించగా,యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూర్చారు.

సంబంధిత సమాచారం :

More