ట్రైలర్ తో ఆకట్టుకుంటున్న ‘గాలి సంపత్’.!

Published on Feb 27, 2021 3:30 pm IST

యాంగ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న కొత్త చిత్రం’గాలి సంపత్’. అనీష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ రాజేంద్ర ప్రసాద్ శ్రీవిష్ణు తండ్రిగా నటిస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. రాజేంద్ర ప్రసాద్ కొత్త గెటప్ లో యాక్టర్ గా జోకర్ గా కనిపించాడు. ప్రతి ఒక్కరూ ఎగతాళి చేయడం, తన తండ్రి వల్ల వచ్చే సమస్యలతో ఇబ్బంది పడే కొడుకుగా శ్రీ విష్ణు ఈ సినిమాలో నటిస్తున్నాడు. మొత్తానికి ట్రైలర్ ను చూస్తుంటే సినిమా సెటప్ అండ్ కామెడీ చాలా బాగుండేలా కనిపిస్తోంది. మార్చి 19న ఈ సినిమా రిలీజ్ కానుంది.

కాగా మోస్ట్ ఎంటర్టైనింగ్ చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి స‌మ‌ర్ప‌ణ‌లో వస్తున్నాడు ‘గాలి సంప‌త్`. అనిల్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించడంతో పాటు స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ వ‌హిస్తుండ‌డంతో సినిమాకి స్పెష‌ల్ క్రేజ్ వ‌చ్చింది. వ‌రుస‌గా ఐదు బ్లాక్‌బ‌స్ట‌ర్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో మ‌రో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా `గాలి సంప‌త్` రూపొందుతోంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :