ఆది ఫ్యూచర్ డిసైడ్ చేయనున్న ‘గాలిపటం’.

ఆది ఫ్యూచర్ డిసైడ్ చేయనున్న ‘గాలిపటం’.

Published on Aug 6, 2014 6:54 PM IST

galipatam-pramotional-song
సాయి కుమార్ తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆది తొలి సినిమా ‘ప్రేమ కావాలి’తో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత నటించిన ‘లవ్లీ’ సినిమా విజయం సాదించడంతో యంగ్ లవర్ బాయ్ పాత్రలకు పర్ఫెక్ట్ గా సరిపోతాడని అంతా భావించారు. యాక్టింగ్, డాన్సింగ్ స్కిల్స్ కుర్రాడిలో బాగుండడంతో ప్రామిసింగ్ హీరోల జాబితాలో చేరిపోయాడు.

మాస్ హీరో అనిపించుకోవాలనే ప్రయత్నంలో ఆది చేసిన ‘సుకుమారుడు’ సినిమా ఆశించిన రీతిలో విజయం సాదించలేదు. ‘సుకుమారుడు’ తర్వాత వచ్చిన ‘ప్యార్ మే పడిపోయానే’ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ రెండు సినిమాల ఫలితాలతో విజయాల రేసులో ఆది కొంచం వెనుకబడ్డాడు. ఇప్పుడు ఆదికి అర్జెంటుగా ఒక హిట్ కావాలి. ఈ శుక్రవారం విడుదల అవుతున్న ‘గాలిపటం’పైనే ఆది తన ఆశలన్ని పెట్టుకున్నాడు.

సంపత్ నంది కథ, స్క్రీన్-ప్లే, మాటలు అందించిన ‘గాలిపటం’ తప్పకుండా విజయం సాదిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు ఈ యువ హీరో. ఆది కెరీర్ కు ఈ సినిమా విజయం కీలకంగా మారింది. మిగతా యువ హీరోల నుండి పోటి తట్టుకోవాలంటే ఈ సినిమా గ్యారెంటీ హిట్ కొట్టాలి. ‘గాలిపటం’ సాంగ్స్, ట్రైలర్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమా విజయం సాదిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

తాజా వార్తలు