ఓటీటీలోకి గేమ్ ఛేంజర్.. ఫ్యాన్స్ రిక్వెస్ట్ ఇదే

ఓటీటీలోకి గేమ్ ఛేంజర్.. ఫ్యాన్స్ రిక్వెస్ట్ ఇదే

Published on Feb 4, 2025 8:04 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియార అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన అవైటెడ్ సినిమా గేమ్ ఛేంజర్ కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా అనుకున్న అంచనాలు అందుకోలేకపోయింది. మరి ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీ ఎంట్రీకి కూడా సిద్ధం అవుతుంది.

ఈ సినిమా ఓటీటీ హక్కులు ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా లేటెస్ట్ గా వీరు గేమ్ ఛేంజర్ ఓటీటీ డేట్ కోసం టీజ్ చేస్తున్నారు. అయితే ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ మరొకటి డిమాండ్ చేస్తున్నారు. దయచేసి సినిమా అదనపు నిడివితో రిలీజ్ చెయ్యాలని అడుగుతున్నారు.

శంకర్ చెప్పిన 5 గంటల ఫుటేజ్ కూడా అవసరం లేదు. కొంచెం అయినా ఎక్స్ట్రా ఇచ్చి మంచిగా ఎడిట్ చేసి అందిస్తే చాలు అంటున్నారు. మరి దీనిపై ఏమన్నా క్లారిటీ వస్తుందేమో చూడాలి. అలాగే డేట్ కూడా త్వరలోనే రివీల్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు