‘గేమ్ ఓవర్’ కలెక్షన్స్ డబుల్ అయ్యాయి

Published on Jun 16, 2019 9:23 pm IST

గత శుక్రవారం విడుదలైన నాలుగు సినిమాల్లో తాప్సీ నటించిన ‘గేమ్ ఓవర్’ కూడా ఉంది. ప్రివ్యూలతో మంచి రెస్పాన్స్ రావడంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి బాగా పెరిగింది. దీంతో నాలుగు సినిమాల్లోనూ దీనికే ఎక్కువ ఓపెనింగ్స్ దక్కాయి. మొత్తం మూడు భాషల్లో రిలీజ్ కాగా మొదటిరోజు శుక్రవారం హిందీలో 38 లక్షలు, తమిళంలో 30 లక్షలు, తెలుగులో 29 లక్షలు కలిపి మొత్తంగా 97 లక్షలు రాబట్టింది.

మొదటిరోజు టాక్ బాగుండటంతో శనివారం నాడు ఈ వసూళ్లు భారీగా పుంజుకుని డబుల్ అయ్యాయి. రెండవ రోజు హిందీలో 88 లక్షలు, తెలుగులో 56 లక్షలు, తమిళంలో 50 లక్షలు కలిపి మొత్తంగా 1.94 కోట్లు వసూలైంది. అనగా రెండు రోజులకు కలిపి 2.91 కోట్లను ఖాతాలో వేసుకుంది ఈ చిత్రం. ఇక ఈరోజు ఆదివారం కావడంతో ఈ వసూలు స్టడీగా కొనసాగే అవకాశం ఉంది. అశ్విన్ శరవణన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఎస్. శశికాంత్ నిర్మించారు.

సంబంధిత సమాచారం :

X
More