తాప్సీ ‘గేమ్ ఓవర్’ మూడు బాషల్లో విడుదలకానుంది !

Published on May 10, 2019 2:16 pm IST

సౌత్ తోపాటు హిందీలోకూడా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది రైజింగ్ హీరోయిన్ తాప్సీ. ప్రస్తుతం సౌత్ లో ఆమె ‘గేమ్ ఓవర్’ అనే తమిళ చిత్రంలో నటిస్తుంది. ఈచిత్రంలో తాప్సీ వీడియో గేమ్ డెవలపర్ పాత్రలో నటిస్తుంది. హార్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈచిత్రాన్ని ‘మాయ’ ఫేమ్ అశ్విన్ శరవణ తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.

ఇక ఈ చిత్రం తెలుగు , తమిళం తోపాటు హిందీ బాషలోకూడా విడుదలకానుంది. రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ , వై నాట్ స్టూడియోస్ తో కలిసి ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఈ చిత్రాన్నీ హిందీలో విడుదలచేయనున్నాడు.

సంబంధిత సమాచారం :

More