ఇండియా – పాక్ మ్యాచ్.. అయినా తాప్సీ తగ్గలేదు

Published on Jun 17, 2019 11:00 pm IST

తాప్సీ ప్రధాన పాత్రలో అశ్విన్ శరవణన్ రూపొందించిన చిత్రం ‘గేమ్ ఓవర్’. మొదటి నుండి మంచి పాజిటివ్ బజ్ కలిగిన ఈ సినిమా విడుదల రోజు పర్వాలేదనే ఓపెనింగ్స్ సాధించింది. హిందీ, తెలుగు, తమిళం మూడు భాషల్లో కలిపి 1.94 కోట్లు రాబట్టుకుంది. మొదటిరోజు అన్ని పరిశ్రమల్లోనూ పాజిటివ్ టాక్ రావడంతో వసూలు పుంజుకున్నాయి. రెండవ రోజు దాదాపు డబుల్ అయ్యాయి. హిందీలో 88 లక్షలు, తెలుగులో 56 లక్షలు, తమిళంలో 50 లక్షలు కలిపి మొత్తంగా 1.94 కోట్లు రాబట్టింది.

ఇక నిన్న ఆదివారం అయినప్పటికీ వరల్డ్ కప్ టోర్నీలో కీలకమైన ఇండియా, పాక్ మ్యాచ్ జరగడం వలన దేశం మొత్తం దానిపైనే దృష్టి పెట్టింది. ఫలితంగా నిన్న థియేటర్లలో పెద్దగా ఆక్యుపెన్సీ లేదు. దీంతో ప్రతి సినిమా వసూళ్లు శనివారంతో పోలిస్తే కొంచెం తగ్గాయి. కానీ ‘గేమ్ ఓవర్’ మాత్రం తగ్గలేదు. శనివారం 1.94 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా ఆదివారంనాడు తెలుగులో 52 లక్షలు, తమిళంలో 78 లక్షలు, హిందీలో 74 లక్షలు కలిపి 2 కోట్లకు పైగానే రాబట్టింది. ఒకవేళ మ్యాచ్ లేకుండా ఉంటే ఈ పెరుగుదల ఇంకా ఎక్కువగానే ఉండేది

సంబంధిత సమాచారం :

X
More