గ్యాంగ్ లీడర్ నైజాంలో కలెక్షన్స్ రిపోర్ట్

Published on Sep 15, 2019 12:50 pm IST

నాని లేటెస్ట్ మూవీ గ్యాంగ్ లీడర్ మొన్న శుక్రవారం గ్రాండ్ గా విడుదలైంది. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రంలో నాని కామెడీ టైమింగ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఇక వసూళ్ల పరంగా కూడా గ్యాంగ్ లీడర్ తెలుగు రాష్ట్రాలలో స్ట్రాంగ్ గానే ఉందని వస్తున్న రిపోర్ట్ లను చూస్తే అర్థం అవుతుంది. ముఖ్యంగా నైజాంలో రెండు రోజులకు గాను గ్యాంగ్ లీడర్ 3.09 కోట్ల షేర్ రాబట్టినట్టు తెలుస్తుంది.

మొదటి రోజు 1.60 కోట్ల షేర్ సాధించిన ఈ చిత్రం శనివారం కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో 1.49 కోట్ల డిస్ట్రిబ్యూటర్స్ షేర్ వసూలు చేసింది. ఇక ఈ వారాంతంలో ఆదివారం మిగిలి ఉండటంతో గ్యాంగ్ లీడర్ వసూళ్ళలో పుంజుకునే అవకాశం కలదు. యూఎస్ లో కూడా ఈచిత్రం మంచి వసూళ్లను రాబడుతుంది. ఇప్పటికే అక్కడ హాఫ్ మిలియన్ మార్క్ ని దాటిపోయినట్టు సమాచారం.

సంబంధిత సమాచారం :

X
More