‘గ్యాంగ్ లీడర్’ రివేంజ్ డ్రామాతో కామెడీ చేస్తాడట ?

Published on Aug 16, 2019 1:00 am IST

నేచురల్ స్టార్ నాని హీరోగా – స్క్రీన్ ప్లే స్పెషలిస్ట్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘గ్యాంగ్ లీడర్’. కాగా సెప్టెంబర్ 13న విడుదల కానున్న ఈ సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందట. సరికొత్త కంటెంట్ తో రివేంజ్ డ్రామాతో సాగే కామెడీ ఎంటర్ టైనర్ ఈ సినిమా అని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో నాని క్యారెక్టర్ చాల బాగుంటుందని.. కొన్ని కీలక సన్నివేశాలు చాలా కామెడీగా సాగుతాయని సమాచారం. ఈ సినిమాలో నాని సరసన ప్రియాంకా అరుళ్ మోహన్ నటిస్తుండగా, ఆర్ఎక్స్ 100′ హీరో కార్తికేయ నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడు.

అలాగే ఇతర కీలక పాత్రల్లో వెన్నెల కిషోర్, ప్రియదర్శి, రఘుబాబు, సత్య నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే సెప్టెంబర్ 13న వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ కూడా రిలీజ్ కాబోతుంది. మరి ‘గ్యాంగ్ లీడర్’ ‘వాల్మీకి’ చిత్రాల్లో బాక్సాఫీస్ వద్ద ఏది ముందడుగులో ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :