మిలియన్ మార్క్ అందుకోవడానికి కష్టపడుతున్న ‘గ్యాంగ్ లీడర్’

Published on Sep 19, 2019 12:30 am IST

నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’ చిత్రం మిశ్రమ స్పందన వచ్చినా మొదటి వారాంతంలో బాగానే పెర్ఫార్మ్ చేసింది. ఓవర్సీస్లో నానికి మంచి మార్కెట్ ఉండటంతో ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. ప్రీమియర్ల ద్వారా 200,132 డాలర్లు వసూలు కాగా శుక్రవారం 149,031 డాలర్లు వసూలయ్యాయి. శనివారం కలెక్షన్స్ బాగా పుంజుకుని 257,270 డాలర్లు వసూలయ్యాయి. దీంతో శనివారం నాటికి మొత్తం కలెక్షన్స్ హాఫ్ మిలియన్ దాటి 600,000 డాలర్లకు చేరుకున్నాయి.

ఆదివారం కూడా పర్వాలేదనిపించి 130,860 డాలర్లు వసూలు చేసింది. ఇక సోమవారం నుండి కలెక్షన్స్ అనూహ్యంగా తగ్గుముఖం పట్టాయి. మంగళవారం నాటికి మొత్తం వసూళ్లు 821,607 డాలర్లకు చేరుకున్నాయి. దీన్నిబట్టి చిత్రం మిలియన్ మార్క్ అందుకోవడానికి కష్టపడాల్సిన పరిస్తితి. ఇక ఈ శుక్రవారం ‘వాల్మీకి’ విడుదల ఉండటంతో మరింత ప్రతికూల పరిస్ఠితి ఏర్పడనుంది.

సంబంధిత సమాచారం :

X
More