డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్స్ పతాకం పై వచ్చిన చిత్రం ‘నాని’స్ గ్యాంగ్ లీడర్’. కాగా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కోసం పోరాడుతోన్న ఈ సినిమా మొదటి వారంలో డీసెంట్ కలెక్షన్స్ ను రాబట్టినా.. వారాంతంలో మాత్రం ఈ సినిమా కలెక్షన్స్ బాగా పడిపోయాయి, కాగా తాజాగా ఏపీ అండ్ తెలంగాణలో ఈ సినిమా కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఈ చిత్రం 15.2 కోట్లు రాబట్టింది. అయితే ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ 29 కోట్లు కావడంతో, గ్యాంగ్ లీడర్ బ్రేక్ ఈవెన్ మార్క్ ను అందుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. పైగా రేపు వరుణ్ తేజ్ వాల్మీకి రిలీజ్ అవుతుంది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే గ్యాంగ్ లీడర్ వాల్మీకిని తట్టుకుని నిలబడాలి.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన చెన్నై బ్యూటీ ప్రియాంకా అరుళ్ మోహన్ ఈ సినిమాతో టాలీవుడ్ లో ఎంతవరకూ నెట్టుకొస్తోందో చూడలి. అలాగే ఇటీవలే గుణ అంటూ మరో ప్లాప్ ను తన ఖాతాలో వేసుకున్న ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ నెగిటివ్ రోల్ లో ఈ సినిమాతో బాగానే ఆకట్టుకున్నాడు. ఈ చిత్రానికి యంగ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాని నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్(సివిఎం) కలిసి నిర్మించారు.
