కృష్ణాలో ‘గంగ’కి స్ట్రాంగ్ కలెక్షన్స్

కృష్ణాలో ‘గంగ’కి స్ట్రాంగ్ కలెక్షన్స్

Published on May 3, 2015 2:27 PM IST

ganga
ఆడియన్స్ ని భయపెట్టే హర్రర్ కాన్సెప్ట్ కి ఆడియన్స్ ఆద్యంతం నవ్వుకునేలా కామెడీనికి కూడా సమపాళ్ళలో మిక్స్ చేసి కోరియోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ చేసిన సినిమా సీక్వెల్ ప్రాంచైజ్ ముని. ముని, కాంచనల తర్వాత వీటికి కొనసాగింపుగా రాఘవ లారెన్స్ చేసిన సినిమా ‘గంగ’. ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. మునుపటి సీక్వెల్స్ లానే ఈ సినిమా కూడా భయపెడుతూ, నవ్విస్తూ మాస్ ప్రేక్షకులచేత కలెక్షన్స్ కురిపిస్తోంది. మొదటి రోజు సుమారు 3.55 కోట్లు కలెక్ట్ చేసిందని ఇది వరకే తెలియజేశాం.

కాంచన సినిమా క్రేజ్ వల్ల ‘గంగ’ సినిమా కృష్ణా జిల్లాలో స్ట్రాంగ్ కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. మొదటి రోజు సుమారు 29 లక్షల షేర్ క్రాస్ చేసిన ఈ సినిమా గంగ, రెండవ రోజు కూడా సుమారు 17 లక్షల షేర్ సాధించింది. మొత్తంగా మొదటి రోజుల్లో ఒక్క కృష్ణా జిల్లాలోనే 46 లక్షల షేర్ కలెక్ట్ చేసారు. ప్రసతుతం సమ్మర్ సీజన్ కావడం వలన ఈ సినిమా ఓవరాల్ గా ఒక కోటి నుంచి 1.5 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన ఏరియాల్లో కూడా మొదటి రెండు రోజులు కలెక్షన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. రాఘవ లారెన్స్ హీరోగా తాప్సీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నిత్యా మీనన్ ఓ ముఖ్య పాత్రలో కనిపించింది.

తాజా వార్తలు