విశ్వక్ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” నుండి థర్డ్ సింగిల్ రిలీజ్ కి రెడీ!

విశ్వక్ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” నుండి థర్డ్ సింగిల్ రిలీజ్ కి రెడీ!

Published on May 9, 2024 2:01 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Viswak sen) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of godavari). ఈ చిత్రంను మే 17, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం నుండి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి థీమ్ సాంగ్ అయిన బ్యాడ్ సాంగ్ ను రేపు ఉదయం 11:07 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఇది మూడో ఈ చిత్రం నుండి మూడో సాంగ్ అని చెప్పాలి.

ఇదే విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. రిలీజ్ చేసిన పోస్టర్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం లో హీరో విశ్వక్ సేన్ లంకల రత్న అనే పాత్రలో నటిస్తున్నారు. నేహ శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మిస్తున్నారు. అంజలి కీలక పాత్రలో నటిస్తుండగా, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు