టాలీవుడ్ లో బిజీ అవుతున్న కేజీఎఫ్ విలన్

Published on Jul 7, 2021 2:00 pm IST

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. అయితే కేజీఎఫ్ చిత్రం లో విలన్ పాత్ర అయిన గరుడ పాత్రలో నటించి అభిమానుల, ప్రేక్షకుల ప్రశంసలు పొందారు రామ్. అయితే రామ్ టాలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోతున్నారు. ఇప్పటికే శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న మహా సముద్రం సినిమా లో కీలక పాత్రలో నటిస్తున్నారు రామ్. అయితే నేడు రామ్ పుట్టిన రోజు సందర్భంగా తన రెండవ సినిమా ను అనౌన్స్ చేయడం జరిగింది.

శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న భళా తందనాన చిత్రం లో రామ్ ఆనంద్ బాలి అనే పాత్రలో నటిస్తున్నారు.అయితే ఈ చిత్రం లో తను ఎలా ఉండబోతున్నారు అనేది ఫస్ట్ లుక్ ద్వారా చిత్ర యూనిట్ తెలిపింది. రామ్ పుట్టిన రోజున ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేయడం తో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే భళా తందనాన చిత్రానికి చైతన్య దంతులూరి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రం లో కేథరిన్ థెరిస్సా హీరోయిన్ గా నటిస్తుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి వారాహి చలన చిత్రం బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :