ఆ మూడు సినిమాలకు సీక్వెల్స్ రెడీ చేసిన గౌతమ్ మీనన్.?

Published on May 27, 2020 3:00 am IST

అటు కోలీవుడ్ లో మరియు మన టాలీవుడ్ లో కూడా వైవిధ్య చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకులలో గౌతమ్ మీనన్ కూడా ఒకరు. స్లో పాయిజన్ లా ఎక్కే టేకింగ్ తో తీసే గౌతమ్ సినిమాలు అంటే మన టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆసక్తి కనబరుస్తారు.

అలా తాను తీసిన ఓ మూడు వైవిధ్య సినిమాలకు గౌతమ్ సీక్వెల్స్ రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అవి విశ్వ నటుడు కమల్ హాసన్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ “రాఘవన్”, అలాగే నాగ చైతన్య మరియు సమంతలతో తెరకెక్కించిన అద్భుతమైన లవ్ స్టోరీ “ఏమాయ చేసావే”, అలాగే కోలీవుడ్ స్టార్ హీరో థలా అజిత్ నటించిన మరో సస్పెన్స్ థ్రిల్లర్ జాన్రా చిత్రం “ఎంతవాడు గాని”.

ఈ మూడు సినిమాలకు గౌతమ్ మీనన్ ఇప్పుడు సీక్వెల్ స్క్రిప్ట్స్ రెడీ చేసుకున్నారట. అలాగే ఈ మూడింటినీ ఒక్కొక్క దాని తర్వాత మరొకటి వరుసగానే దర్శకత్వం వహించే యోచనలో ఉన్నారని మరో టాక్ కూడా..మరి ఏది ఏమైనప్పటికీ మాత్రం వీటిలో ఏ ఒక్క చిత్రానికి సీక్వెల్ వచ్చినా గౌతమ్ మీనన్ ఫ్యాన్స్ కు ఫీస్ట్ అనే చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More