‘డియర్ ఆస్ట్రోనాట్’ నుంచి గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ విడుదల

‘డియర్ ఆస్ట్రోనాట్’ నుంచి గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ విడుదల

Published on Sep 22, 2026 8:00 AM IST

కార్తీక్ భాగ్యరాజా రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డియర్ ఆస్ట్రోనాట్’. ఈ సినిమాలో దర్శకుడు, నటుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ పోషిస్తున్న పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో ఆయన డేవిడ్ థామస్ అనే పాత్రలో కనిపిస్తున్నారు.

​ఈ చిత్రం కోసం ‘క్యారెక్టర్ రివీల్ వీక్’ను ప్రారంభించినట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. అందులో భాగంగానే గౌతమ్ మీనన్ లుక్‌ను మొదటగా పరిచయం చేశారు. రానున్న రోజుల్లో సినిమాలోని ఇతర పాత్రల వివరాలు, పోస్టర్లను వరుసగా వెల్లడించనున్నారు.

​అంతరిక్షంలోకి ప్రయాణించాలనే లక్ష్యం ఉన్న ఒక యువతి కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. ఆ కలను నెరవేర్చుకునే క్రమంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు, భావోద్వేగాల నేపథ్యంలో కథ సాగుతుంది.

​ఈ చిత్రానికి కార్తీక్ బి కొడకండ్ల సంగీతం అందిస్తున్నారు. యువన్‌కృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్, మనస్విని భాగ్యరాజా సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను సమర్పిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు