మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గోవిందుడు అందరివాడేలే’. దసరా కానుకగా అక్టోబర్ 1న రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ మెప్పు పొందుతూ ఆడియన్స్ ని థియేటర్స్ కి రాబట్టుకుంటోంది. క్లాస్ ఎంటర్ టైనర్స్ కి యుఎస్ లో కూడా మంచి కలెక్షన్స్ వస్తాయి. అలాంటి సినిమాల కోవలోనే ఈ సినిమా కూడా చేరింది.
గోవిందుడు అందరివాడేలే సినిమా శుక్రవారం వరకూ $ 400,000 డాలర్స్ కలెక్ట్ చేసిందని తెలియజేశాము. లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం శనివారం రోజు $ 149,000 డాలర్స్ కలెక్ట్ చేసి యుఎస్ లో హాఫ్ మిలియన్ మార్క్ ని క్రాస్ చేసింది. శనివారంతో మొత్తం $ 549,000 డాలర్స్ (ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు 3.37 కోట్లు) కలెక్ట్ చేసి రామ్ చరణ్ ‘నాయక్’ రికార్డ్ ని బ్రేక్ చేసి, చరణ్ కెరీర్లో యుఎస్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచిపోయింది. చాలా లో కలెక్షన్స్ తో మొదలయ్యి రోజు రోజుకీ కలెక్షన్స్ పెంచుకుంటూ పోతున్న ఈ సినిమా మరో రెండు రోజులు కూడా మంచి కలెక్షన్స్ రాబట్టుకునే అవకాశం ఉంది.
రామ్ చరణ్ – కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమాకి కృష్ణవంశీ డైరెక్టర్. ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీ కాంత్, కమలినీ ముఖర్జీలు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి బండ్ల గణేష్ నిర్మాత.


