సీడెడ్ లో భారీ రేటు పలికిన గోవిందుడి రైట్స్

సీడెడ్ లో భారీ రేటు పలికిన గోవిందుడి రైట్స్

Published on Jul 11, 2014 11:30 AM IST

Govindu
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘గోవిందుడు అందరివాడెలే’. ఈ సినిమాని అక్టోబర్ మొదటి వారంలో రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. కానీ అప్పుడే ఈ సినిమా బిజినెస్ మాత్రం మొదలైపోయింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సీడెడ్ రైట్స్ కి జరిగిన గట్టి పోటీలో లక్ష్మీకాంత్ రెడ్డి ఓ భారీ మొత్తానికి గోవిందుడు అందరివాడెలే సినిమా రైట్స్ ని సొంతం చేసుకున్నాడు.

ఇలా సినిమా షూటింగ్ సగంలోనే సినిమా అమ్ముడు పోవడం అనేది నిర్మాతలకి సంతోశాన్నిచ్చే విషయం. బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి కృష్ణవంశీ డైరెక్టర్. జూలై 13 నుంచి పొల్లాచ్చిలో కొత్త షెడ్యూల్ మొదలు కానున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

రామ్ చరణ్ ఎన్నారై గా కనిపించనున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, శ్రీ కాంత్, జయసుధ, కమలినీ ముఖర్జీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని జూలై 28న రిలీజ్ చేయనున్నారు.

తాజా వార్తలు