‘గోవిందుడు..’ సెన్సార్ కంప్లీటెడ్..

Published on Sep 26, 2014 3:00 pm IST

GAV-3
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఈ సినిమాకి ‘యు/ఏ’ సర్టిఫికేట్ జారి చేశారు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశి దర్శకత్వంలో పరమేశ్వరా ఆర్ట్ ప్రొడక్షన్ పతాకంపై బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అక్టోబర్ 1, ఉదయం 5 గంటల 18 నిముషాలను ముహూర్తంగా నిర్ణయించారు.

ఇటివల సినిమా చూసిన చిరంజీవి కంట తడి పెట్టుకున్నారు. సినిమాలో చివరి 30 నిముషాలు ప్రేక్షకుల హృదయాలను కదిలించేలా కృష్ణవంశి తెరకెక్కించారని, ‘అత్తారింటికి దారేది’ తరహాలో మా ‘గోవిందుడు అందరివాడేలే’… ఓ మంచి కుటుంబ కధా చిత్రమని నిర్మాత తెలిపారు. ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, కమలిని ముఖర్జీ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఆడియో శ్రోతలను అలరిస్తుంది.

సంబంధిత సమాచారం :