ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ ప్రొడ్యూసర్స్ లో బ్లాక్ బస్టర్ బండ్ల గణేష్ కూడా ఒకరు. ఆయన నిర్మించే ప్రతి సినిమా చాలా రిచ్ గా ఉండాలని, తెలుగు ప్రేక్షకులకు విజువల్స్ తో సరికొత్త అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో భారీ బడ్జెట్ తో సినిమాలను నిర్మిస్తారు. ప్రస్తుతం బండ్ల గణేష్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా చేస్తున్నారు.
ఈ సినిమా కూడా తన కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ అవుతుందని బండ్ల గణేష్ గట్టిగా చెబుతున్నాడు. ‘ఇప్పుడే ‘గోవిందుడు అందరివాడేలే’ రషెస్ చూసాను. సూపర్బ్ గా ఉన్నాయి. మా లిటిల్ స్టార్ మరియు కృష్ణవంశీకి నా థాంక్స్. ఇవి చూసాక నా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ లో మరో బ్లాక్ బస్టర్ రానుందని గర్వంగా అనౌన్స్ చేస్తున్నానని’ బండ్ల గణేష్ ట్వీట్ చేసాడు.
రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, శ్రీ కాంత్, జయసుధ, కమలినీ ముఖర్జీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.



