ఓవర్శిస్లో సత్తాచాటుతున్న గీత గోవిందం !

ఓవర్శిస్లో సత్తాచాటుతున్న గీత గోవిందం !

Published on Aug 17, 2018 5:55 PM IST

‘అర్జున్ రెడ్డి’ ఫేం విజయ్ దేవరకొండ నటించిన చిత్రం ‘గీత గోవిందం’. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈచిత్రం సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. తెలుగు రాష్ట్రల్లో రెండు రోజులకు 9.4కోట్ల షేర్ ను రాబట్టి బ్లాక్ బ్లాస్టర్ విజయం దిశగా దూసుకుపోతుంది.

ఇక ఈ చిత్రం ఓవర్శిస్ లోకూడా అద్భుతమైన కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది. రెండు రోజులకుగాను ఈచిత్రం $737,109 డాలర్ల వసూళ్లను ఖాతాలో వేసుకుంది. ఈరోజుతో అక్కడ ఈ సినిమా మిల్లియన్ మార్కును చేరుకోనుంది.

పరుశరాం తెరకెక్కించిన ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందించారు. గీతాఆర్ట్స్ 2 పతాకం ఫై బన్నీవాసు నిర్మించిన ఈచిత్రంలో విజయ్ సరసన రష్మిక నటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు