తమిళ్లో హిట్ తో ప్రారంభమైన గీత ఆర్ట్స్ సెకండ్ ఇన్నింగ్స్

geetha-arts

ఈ మధ్య కాలంలో లో బడ్జెట్ సినిమాలు తీయాలనుకునే నిర్మాతలు, దర్శకులు ఎంచుకుంటున్న జోనర్ హర్రర్ కామెడీ. ఈ జోనర్ లో అవ్చ్చిన పలు సినిమాలు ఇప్పటికే బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాల్ని అందుకున్నాయి. అలా వచ్చిన ప్రేమ కథా చిత్రమ్ తెలుగులో పెద్ద హిట్ అయ్యింది. టాలీవుడ్ లో ఉన్న బిగ్గెస్ట్ ప్రొడక్షన్ బ్యానర్స్ లో గీత ఆర్ట్స్ బ్యానర్ ఒకటి.. గీత ఆర్ట్స్ అధినేత అయిన అల్లు అరవింద్ స్టూడియో గ్రీన్ నిర్మాతలతో కలిసి ఈ ప్రేమ కథా చిత్రాన్ని ‘డార్లింగ్’ పేరుతో తమిళంలో రీమేక్ చేసారు.

ఈ సినిమా నిన్న తమిళ నాడులో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా తమిళనాడులో హౌస్ ఫుల్ కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. సుమారు 25 సంవత్సరాల తర్వాత తమిళంలో మళ్ళీ సినిమాలు చేయడం ప్రారంభించిన గీత ఆర్ట్స్ బ్యానర్ వారు సెకండ్ ఇన్నింగ్స్ లో మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ హీరోగా పరిచయం అయిన ఈ సినిమాలో నిక్కి గల్రాని హీరోయిన్ గా నటించింది.

Exit mobile version