గీత గోవిందం 8రోజుల నైజాం కలక్షన్స్ !

గీత గోవిందం 8రోజుల నైజాం కలక్షన్స్ !

Published on Aug 23, 2018 2:50 PM IST

Geetha

విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం ఇటీవల విడుదలై అద్భుతమైన కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది. ఈ చిత్రం విడుదలై 7రోజులైనా కూడా కలెక్షన్స్ విషయంలో తగ్గుదల కనిపించడం లేదు. ఈచిత్రానికి వేరే చిత్రాల నుండి పోటీ లేకపోవడంతో థియేటర్లలో ఇంకా హౌస్ ఫుల్ బోర్డులు పడుతున్నాయి.

ఇక ఈ చిత్రం నైజాంలో 8రోజులకుగాను 12.2కోట్ల షేరును రాబట్టింది. నిన్నబక్రీద్ పండుగ సంధర్బంగా సెలువు దినం కావడంతో అక్కడ 1.2కోట్ల వసూళ్లను ఖాతాలో వేసుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈచిత్రంలో విజయ్ కు జోడిగా రష్మిక నటించింది. పరశురాం తెరకెక్కించిన ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు.

తాజా వార్తలు