ఇంటర్వ్యూ : రష్మిక మందన్నా – డియర్ కామ్రేడ్ సినిమా కూడా నటిగా నన్ను ఇంకో మెట్టు ఎక్కిస్తోంది.

ఇంటర్వ్యూ : రష్మిక మందన్నా – డియర్ కామ్రేడ్ సినిమా కూడా నటిగా నన్ను ఇంకో మెట్టు ఎక్కిస్తోంది.

Published on Aug 16, 2018 5:00 PM IST

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా పరశురాం దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘గీత గోవిందం’. గీతా ఆర్ట్స్-2 పతాకం ఫై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించారు. కాగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సంధర్బంగా ఈ చిత్ర హీరోయిన్ రష్మిక మందన్నా మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం..

నాకు ప్రేక్షకుల స్పందనలంటే చాలా ఇష్టం

నేను ఎప్పుడు నా సినిమాలను ప్రేక్షకులతో పాటే కలిసి చూస్తాను. గీత గోవిందం చిత్రాన్ని కూడా సేమ్ ప్రేక్షకులతో పాటే కలిసి చూసాను. సినిమాని వాళ్ళు ఎంజాయ్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. నేను ఈ సినిమా కథ విన్నప్పుడే అనుకున్నాను. ఈ సినిమాలో కామెడీ బాగా సక్సెస్ అవుతుందని నిజంగానే కామెడీకి మంచి పేరు వచ్చింది.

గీత పాత్రకు నేను ఫస్ట్ ఛాయిస్ కాదని ఈ చిత్ర దర్శకుడు పరుశురామ్ నాకు ముందే చెప్పారు.

పరశురామ్ గారు నాకు కథ చెప్పే సమయంలో చెప్పిన మొట్టమొదటి విషయం ఏమిటంటే నేను ఈ సినిమాకి ఫస్ట్ చాయిస్ కాదని, కానీ నాకు మాత్రం ఈ సినిమాని ఎవరు రిజక్ట్ చేశారు. నేను ఎవర్ని రీప్లేస్ చేశాను ఇలాంటి ఆలోచనలు అయితే నాకు ఎప్పుడు లేవు. నేను ఓన్లీ నా పాత్ర గురించే మాత్రమే ఆలోచించాను. ఎందుకంటే స్క్రిప్ట్ లో గీత పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర. నేను కథ విన్న దగ్గర నుండి గీత పాత్రను ఎలా చెయ్యాలి ఎంత బాగా చెయ్యాలి అని ఆలోచిస్తూనే పని చేశాను. ఫైనల్ గా మా చిత్రబృందంతో పాటు ప్రేక్షకులు కూడా నా నటనకు ప్రశంసలు కురిపిస్తోంటే చాలా ఆనందంగా ఉంది.

ఈ సినిమా షూటింగ్ సమయం నాకు లవ్లీ టైం అని చెప్పాలి, అంత బాగా ఎంజాయ్ చేశాను.

ఈ చిత్రం అంతటా నా పాత్ర చాలా సీరియస్ గా ఉంటుంది. గీత పాత్ర క్లిక్ అవ్వాలంటే సందర్భానుసారంగా ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఎలాగోలా ఆ ఎక్స్ ప్రెషన్స్ పట్టుకున్నాను. ఓ పక్క విజయ్ తన రోల్ లో అద్భుతంగా నటించాడు. నేను సీరియస్ గా క్రాక్ గా ఉన్న ప్రతిసారి విజయ్ మేడమ్ మేడమ్ అని పిలుస్తూ చాలా బాగా చేశాడు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మా ఇద్దరి కెమిస్ట్రీ బాగుందంటుంటే మాకు చాలా గర్వంగా ఉంది.

డియర్ కామ్రేడ్ చిత్రం కూడా నటిగా నన్ను ఇంకో మెట్టు ఎక్కిస్తోంది.

ప్రస్తుతం దేవదాస్ చిత్రంలో కూడా నేను నటిస్తున్నాను. కానీ ఆ చిత్రంలో ఇతర ముఖ్యమైన పాత్రలకు సపోర్ట్ చేసే ఓ సాధారణమైన పాత్రను పోషిస్తున్నాను. కానీ డియర్ కామ్రేడ్ చిత్రంలో మాత్రం మంచి రోల్ ప్లే చేస్తున్నాను. అసలు మేకప్ లేకుండా ఓ సాధారణ అమ్మాయిలా ఈ చిత్రంలో కనిపిస్తాను. ఈ చిత్రం నాలోని ప్రతిభను వెలికి తీసి నటిగా నన్ను ఇంకో మెట్టు ఎక్కిస్తోందని నా నమ్మకం. అంత మంచి పాత్ర నాది. అందరికీ నచ్చుతుంది.

నేను నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ను కూడా దృష్టిలో పెట్టుకుంటాను.

ఓ నటిగా నేను ప్రేక్షకుల అభిప్రాయాలని కూడా గౌరవిస్తాను. ఈ సినిమాలో మేకప్ అంత బాగోదని నాకు చాలామంది చెప్పారు. నేను అలాగే ఫీల్ అయ్యాను. కానీ సినిమాలో నా పాత్ర ఎలా ఉంటే బాగుంటుందో అలాగే పాత్రకి తగ్గట్లు ఉండాలి కదా. ఏమైనా గీత గోవిందం ఇంత పెద్ద హిట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు