నాన్ బాహుబలి రికార్డును బద్దలు కొట్టిన గీత గోవిందం !

నాన్ బాహుబలి రికార్డును బద్దలు కొట్టిన గీత గోవిందం !

Published on Aug 20, 2018 12:05 AM IST

విజయ్ దేవరకొండ , రష్మిక జంటగా పరుశురాం తెరకెక్కించిన చిత్రం’గీత గోవిందం’. ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని తెలుగు రాష్ట్రల్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇక తమిళనాడు లో కూడా విడుదలైన ఈచిత్రం ఏకంగా అక్కడ నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొడుతోంది.

ఈఏడాది ఇటీవల విడుదలైన కార్తీ నటించిన ‘కడై కుట్టి సింగం’ అక్కడ రెండవ అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ ను సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేస్తే తెలుగు నుండి గీత గోవిందం అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టి రికార్డు సృష్టించింది. ఫుల్ రన్ లో అక్కడ తెలుగు వెర్షన్ బాహుబలి వసూళ్లను క్రాస్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు