గీత గోవిందానికి కంగ్రాట్స్ చెప్పిన మహేష్ !

Published on Aug 16, 2018 12:14 pm IST

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గీత గోవిందం’. గీతా ఆర్ట్స్-2 పతాకం ఫై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించారు. కాగా నిన్న విడుదల అయిన ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్ తో కల్ర్క్షన్స్ పరంగా దూసుకెళ్తుంది. ఈ చిత్రం మంచి కామెడీతో బాగా ఎంటర్ టైన్ చేయటంతో మరియు విజయ్ దేవరకొండ రష్మిక కెమిస్ట్రీ చాలా బాగా ఆకట్టుకోవడంతో సినిమాని ప్రేక్షకులతో పాటు సెలబ్రేటిస్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు గీతగోవిందం చిత్రం గురించి ట్వీట్ చేసారు. ‘గీత గోవిందం విన్నర్.. సినిమాని చాలా ఎంజాయ్ చేశాను. విజయ్ రష్మిక నటన బ్రిలియంట్ గా ఉంది. వెన్నెల కిషోర్ కామెడీ కూడా చాలా బాగుంది. గీత గోవిందం టోటల్ టీమ్ కు నా కంగ్రాట్స్ అని మహేష్ పోస్ట్ చేసారు. మహేష్ ట్వీట్ కు స్పందిస్తూ హీరోయిన్ రష్మిక ‘థ్యాంక్యూ సర్’ అని రీట్వీట్ చేసింది.

సంబంధిత సమాచారం :

X
More