గీత గోవిందం నైజాం కలక్షన్స్ !

గీత గోవిందం నైజాం కలక్షన్స్ !

Published on Aug 22, 2018 2:24 PM IST

Geetha

విజయదేవరకొండ నటించిన గీత గోవిందం గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో బ్లాక్ బ్లాస్టర్ విజయం వైపు దూసుకుపోతుంది. ఇక ఈ చిత్రం వారం రోజులకుగాను 10కోట్ల 70లక్షల షేర్ ను రాబట్టింది. ఫుల్ రన్ లో ఈచిత్ర ప్రపంచ వ్యాప్త థియేట్రికల్ హక్కులు 15కోట్లులను ఒక్క నైజాం ప్రాంతంలోనే రాబట్టనుంది.

ఇక ఈ చిత్రంతో యువ హీరో విజయ్ దేవరకొండ స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు. ‘అర్జున్ రెడ్డి’ తరువాత మళ్ళీ అదే రేంజ్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈచిత్ర దర్శకుడు పరశురాం కూడా వరుస ఆఫర్లతో బిజీ అవుతున్నాడు. మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ సంగీతం అందించిన ఈచిత్రంలో విజయ్ కు జోడీగా రష్మిక నటించింది. గీతా ఆర్ట్స్ 2పతాకం ఫై బన్నీ వాసు ఈచిత్రాన్ని నిర్మించారు.

తాజా వార్తలు