బుల్లి తెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సెకండ్ సీజన్ మంచి అంచనాల మధ్య గత ఆదివారం ప్రారంభం అయింది. నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో లో మొత్తం 16 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు అని తెలిసిందే . వారిలో గీతా మాధురి , దీప్తి , అమిత్ తివారి , హీరో తనీష్ , యాంకర్ శ్యామల , తేజస్వి మడివాడ , సామ్రాట్ , దీప్తి సునైనా, బాబు గోగినేని , రోల్ రైడ , కిరీటీ దామరాజు ,కౌశల్ , భాను శ్రీ, నూతన్ నాయుడు , సంజన , గణేష్ లు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు . ఈ సెకండ్ సీజన్ ఎలాసాగుతుందో అని చర్చ జరిపే వారికంటే ఈ షోలో పాల్గొంటున్న వాళ్ల రెమ్యూనరేషన్ల గురించే బయట ఎక్కువగా చర్చ జరుగుతుంది.
వీరిలో ప్రముఖ తెలుగు గాయని గీతామాధురి అందిరికన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట.ఎందుకంటే ఈ సెకండ్ సీజన్ లో పార్టిసిపేట్ చేస్తున్న అందరిలో కన్నా ఆమె ఎక్కువగా అందరికి తెలిసి ఉండడం వల్ల ఆమె అడిగినంత ఇస్తున్నారని సమాచారం . ఇక ఈ సెకండ్ సీజన్ కి ఈమె 20 లక్షల పారితోషికాన్ని తీసుకుంటునట్లు చెప్తున్నారు ఈ వార్తలు నిజమో అబద్ధమో తెలియదు కానీ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


