గీత గోవిందం మొదటి రోజు కలెక్షన్స్ అదిరిపోయాయి !

గీత గోవిందం మొదటి రోజు కలెక్షన్స్ అదిరిపోయాయి !

Published on Aug 16, 2018 1:12 PM IST

పరశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న జంటగా నటించిన చిత్రం ‘గీత గోవిందం’. నిన్న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి రివ్యూస్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంటుంది.

ఇక ఈ చిత్రం యొక్క మొదటి రోజు కలెక్షన్స్ కూడా అదిరిపోయే రేంజ్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు ఈచిత్రం 5.80 కోట్ల షేరును రాబట్టింది. ఇక మిగితా రాష్ట్రాలతో పాటు ఓవర్శిస్ తో కలుపుకొని మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 9.66 కోట్ల షేరును ఖాతాలో వేసుకుంది.

ఈ కలెక్షన్స్ తో సినిమాకు పెట్టిన పెట్టుబడి మొదటి రోజులోనే సగానికి పైగా వెనక్కు వచ్చెసింధి. ఈ లెక్కన ఈచిత్రం భారీ లాభాలను రాబట్టుకోవడం ఖాయం గా కనిపిస్తుంది. గోపీ సుందర్ సంగీతం అందించిన ఈచిత్రాన్ని గీతా ఆర్ట్స్-2 పతాకం ఫై బన్నీ వాసు నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు