అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్ కామెడీ చిత్రం ‘గీతాంజలి’. ఈ చిత్రం ఆడియో జూలై 20న విడుదల చేయనున్నారు. ప్రవీణ్ లక్కరాజు ఈ చిత్రానికి సంగీతం అందించారు. రాజ్ కిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘గీతాంజలి’లో బ్రహ్మానందం సైతాన్ రాజుగా నటించారు. ఈ రోజు టాలీవుడ్ టాప్ కమెడియన్ల చేత బ్రహ్మానందం లుక్ ను విడుదల చేయిస్తున్నారు. ఇప్పటికే ఒక లుక్ విడుదల చేశారు. ఆ పోస్టర్ లో బ్రాహ్మి లుక్ కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభించింది.
సినిమా ఆగస్ట్ 8న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. అంజలి, బ్రహ్మానందం, రావురమేష్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు ‘గీతాంజలి’లో ప్రధాన పాత్రలు పోషించారు. ఒక ప్రముఖ హీరోయిన్ ఈ చిత్రంలో ప్రత్యెక గీతంలో నటించనుందని కోన వెంకట్ చెప్పిన సంగతి తెలిసిందే. ఆ హీరోయిన్ ఎవరనేది గోప్యంగా ఉంచారు. కోన వెంకట్ సమర్పణలో యంవివి పతాకంపై యంవివి సత్యనారాయణ నిర్మిస్తున్నారు.
