తెలుగమ్మాయి అంజలి ప్రధాన పాత్రలో, ప్రముఖ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా తెరకెక్కిన హర్రర్ కామెడీ మూవీ ‘గీతాంజలి’. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఆగష్టు 8న రిలీజ్ చెయ్యాలనుకున్నారు. కానీ అనుకున్న టైంకి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కానందు వల్ల ఈ సినిమాని ఒక రోజు ఆలస్యంగా రిలీజ్ చేయనున్నారు. అనగా ఆగష్టు 9న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రముఖ రచయిత కోనా వెంకట్ సమర్పణలో ఎంవివి సినిమా బ్యానర్ పై ఎంవివి సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ద్వారా రాజ కిరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కోన వెంకట్ ఈ సినిమాకి సమర్పకుడిగానే కాకుండా స్క్రీన్ ప్లే – డైలాగ్స్ ని కూడా అందించాడు.
ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో హర్షవర్ధన్ రాణే, బ్రహ్మానందం, రావు రమేష్, సత్యం రాజేష్, శకలక శంకర్, మధునందన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.


