తెలుగులో చిన్న చిన్న సినిమాలు చేస్తూ ప్రస్తుతం ’33 ప్రేమ కథలు’ సినిమాలో ఓ ఐటెం సాంగ్ మరియు రాజా హీరోగా నటిస్తున్న ‘నమస్తే’ సినిమాలో నటిస్తున్న గెహ్న వశిస్ట్ ఏకంగా బాలీవుడ్ లో ఆఫర్ కొట్టేసింది. అనూప్ జలోట నిర్మించనున్న ‘హ్యాపీ సే’ సినిమాలో గెహ్నకి ఆఫర్ వచ్చింది. కవల్ శర్మ ఈ సినిమాకి డైరెక్టర్.
స్వతహాగా ముంబై కి చెందినా ఈ భామ సౌత్ లోకి ఎలా వచ్చిందా అనే విషయానికి వస్తే ‘నేను మిస్ ఆసియా 2012 లో పార్టిసిపేట్ చేసాను. ఆ తర్వాత మోంటే కార్లో యాడ్ చేసాను. ఆ తర్వాత నుంచి కాలేజ్ లో మా ఫ్రెండ్స్ నన్నో స్టార్ లా చూడడం మొదలు పెట్టారు. దానీని బాగా ఎంజాయ్ చేయడంతో పాటు అది అలాగే కంటిన్యూ చేయాలనుకున్నాను. ఇండస్ట్రీలో మనకు తక్కువ టైం ఉంటుంది. నేను ఎన్ని రోజులు యంగ్ గా ఉంటే అన్ని రోజులు సినిమాలు చేయాలనుకున్నాను. కాజల్, తమన్నా మొదలిఅన్ హీరోయిన్స్ అంటా మొదట సౌత్ లో పనిచేసారు. ఆ తర్వాత్ బాలీవుడ్ వెళ్ళారు. వీటన్నిటికంటే సౌత్ ఇండస్ట్రీ చాలా ప్రొఫెషనల్ గా ఉంటుందని’ తన మనసులో మాటని చెప్పింది.


